ఏడు గంటలు సాగిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ

నవతెలంగాణ హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణ ఇవాళ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు సుదీర్ఘంగా అధికారులు విచారించారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఆదేశాల మేరకు  ప్రతి శనివారం అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆయన్ను సీబీఐ ఇవాళ విచారించింది.

Spread the love