నవతెలంగాణ-హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం హైకోర్టులో చోటు చేసుకుంది. వివేకా హత్య సమాచారం ఏపీ సీఎం జగన్‌కు ఉదయం 6.15 గంటలకే ఎలా తెలిసిందో తెలియడం లేదని సీబీఐ చెప్పింది. వివేకా పీఎ కృష్ణారెడ్డి కంటే ముందుగా జగన్‌కు తెలియడం వెనుక ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేయాల్సివుందని, అయితే అవినాష్ మాత్రం దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పింది. కర్నూల్‌లో అవినాష్‌ను అరెస్టు చేసేందుకు వెళితే అక్కడ జన సమీకరణ ఉండడంతో శాంతిభద్రతల సమస్య ఎదురౌతుందని అరెస్టు చేయలేదని చెప్పింది.
అవినాష్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లక్ష్యంగా సీబీఐ విచారణ చేస్తోందని అవినాష్ లాయర్ చెప్పారు. వాదనలను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ లక్ష్మణ్ చెప్పారు.