వై. శంకర్ కు జిల్లా స్థాయి ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా అవార్డు..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణాధికారి గా పనిచేస్తున్న వై.శంకర్ కు  జిల్లా స్థాయి ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా ఇమ్యూ నైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ చేతుల మీదుగా అవార్డు ను అందుకున్నారు.మంగళవారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఈ అవార్డు స్వీకరించారు జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాటిలో టీబీ, వ్యాధి గ్రాస్తులు, కుష్టు వ్యాధి గ్రాస్తులను గుర్తించడంలోనూ, మలేరియా, డెంగ్యూ ,చికున్ గున్యా ,లాంటి దోమ కాటు వలన వచ్చేటువంటి వ్యాధుల నివారణలో, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిపించడం, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స లు, కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులైన పురుషులకు వెసేక్టమీ ఆపరేషన్ చేయించడంలోనూ, సంక్రమించని వ్యాధులైన డయాబెటిక్, హైపర్టెన్షన్ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి సరైన సమయంలో నెలవారి మందులు అందజేయడంలోనూ కృషి చేసిన వై.శంకర్ కు ఈ అవార్డ్ దక్కింది.ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్, వైశంకర్ కు  శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love