
రాష్ట్ర స్థాయి గణిత సెమినార్ కు మండలం నుండి ఎంపికైన ఉపాధ్యాయులను శుక్రవారం ఘనంగా సన్మానించారు.తెలంగాణా గణిత ఫోరం జిల్లా శాఖ, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి గణిత సెమినార్ కు మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్, ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులు సతీష్ రెడ్డి లు ఎంపికయ్యారు.మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఎర్గట్ల మూడు మండలాల గణిత ఉపాధ్యాయుల సంయుక్త సమావేశంలో రాష్ట్రస్థాయి గణిత సెమినార్ ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా గణిత ఫోరం అధ్యక్షులు కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి గణిత సెమినార్ కమ్మర్ పల్లి మండల ఉపాధ్యాయులు ఎంపీక కావడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మండల నోడల్ అధికారి గంగాధర్, హాసకొత్తుర్ ప్రధానోపాధ్యాయులు డి ఎల్ ఎన్ చారి, గణిత ఫోరం ప్రతినిధులు కృష్ణ కుమార్, దేవానంద్, మూడు మండలాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.