
మండలంలోని దుర్గానగర్ తండా గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ వాలంటీర్స్ కి వేసవి కాలంలో మెక్కల సంరక్షణపై తెలంగాణ యునివర్సిటీ ఎస్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ డా. రవీందర్ రెడ్డి అవగాహన ఆదివారం చేశారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ ఎస్ అధ్వర్యంలో ఆరవ రోజు శ్రమదానం చేసి మొక్కల దగ్గర ఉన్న చెత్తాచెదారాన్ని తీసివేసి, పాదులు కట్టి మొక్కలకు నీటిని అందించారు. నీటి కాలువలో పూడిక లు తీసి పిచ్చి మొక్కల్ని తొలగించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డా. సరిత, డి.సుమలత, శ్వేత పాల్గొన్నారు.