నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో యువ షట్లర్లు భవేష్ రెడ్డి, క్రిషవ్ చాంపియన్లుగా నిలిచారు. సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్‌సి బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన పోటీల్లో బార్సు డబుల్స్ విభాగంలో భవేష్ రెడ్డి, క్రిషవ్‌లు సత్తా చాటారు. బాలికల సింగిల్స్‌లో హంసిని, బాలికల డబుల్స్‌లో మాణ్య అగర్వాల్, నిత్య విజనరి విజయం సాధించారు. బాలుర సింగిల్స్ విభాగంలో హర్షవర్దన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇన్‌కమ్‌ట్యాక్స్ చీఫ్ కమిషనర్ జి. మల్లిఖార్జున, తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు ప్రసాద్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి వంశీధర్‌లు విజేతలను అభినందించి, బహుమతులు అందజేశారు.