ఎలక్షన్ శంఖారావం పూరించిన బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణ- మోపాల్:

మోపాల్ మండలంలోని బోర్గాం(పి) గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా, ఆయనతోపాటు నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి దంపతులు కూడా పూజలు నిర్వహించారు. బొర్గం సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రియుతంగా వేద పండతుల మధ్య వారిని సన్మానం నిర్వహించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కచ్చితంగా ఐదోసారి కూడా రూరల్ నియోజకవర్గంలో ఆ దేవుడు దయతో ప్రజల ఆశీర్వాదంతో గెలిచి తీరుతానని తనకు ఈ రూరల్ ప్రజల ఆశీర్వాదం ఉందని కచ్చితంగా నన్ను మూడోసారి కూడా శాసనసభకు పంపుతారని ఆయన తెలిపారు అలాగే కాంగ్రెస్ పార్టీ,  బీజేపీ పార్టీ గురించి ఆయన మాట్లాడుతూ వారు ఇక్కడ చేసేదేమీ లేదని వారి రిమోట్ కంట్రోల్ మొత్తం ఢిల్లీలో ఉంటుందని ఆ రాహుల్ గాంధీ వచ్చినా కూడా ఇక్కడ నాయకులు ఆశించిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఆయనకు ఈ జిల్లా పైన కానీ జిల్లాలో ఉన్న సమస్యల పైన కానీ ఈ అవగాహన లేదని దాదాపు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారు చేసింది కూడా శూన్యం అని అలాగే నాతో పోటీ చేసిన నాయకులు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని కేవలం ఎలక్షన్ సమయంలోనే వారు ఇక్కడ ఉంటారని కనీసం ప్రజల బాగోగులు తెలుసుకునే సమయం కూడా వారికి ఉండదని అటువంటి వారిని రూరల్ ప్రజలు నమ్మరని నేను చేసిన అభివృద్ధిని చూసి,  రూరల్ ప్రజలందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని దాదాపుగా నేను రోజుకి 14 గంటల సమయం ప్రజలు తో గడుపుతానని, అలాగే మేము పెట్టిన సంక్షేమ పథకాలు కెసిఆర్ కిట్టు కానీ  రైతుబంధు, పింఛన్లు మేము పోయినసారి ఎలక్షన్ లో కూడా చెప్పని పథకాలను కూడా ప్రజల కోసం చేసామని మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని మల్లొకసారి కచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మళ్లీ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా మారుస్తారని తెలిపారు.  ఈ సందర్భంగా కూడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజలు మేలు చేసిన వారిని మర్చిపోరని ముచ్చటగా మూడోసారి కూడా మన రూరల్ నియోజకవర్గం లో బాజిరెడ్డి గోవర్ధన్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని, మన గోవర్ణ మచ్చలేని నాయకుడని అనుక్షణం ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించే మనిషి అని ఇంతకుముందు ఎలక్షన్స్ వచ్చిన మెజార్టీ కంటి రెట్టింపు మెజార్టీతో గెలుస్తారని ప్రతిపక్ష నాయకులను ప్రజలు నమ్మరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొర్వ  దేవేందర్, నుడా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, ఈగ శ్రీనివాస్ రెడ్డి రఘు, సతీష్ రెడ్డి, మోచ్చ శ్రీనివాస్, మోహన్ నాయక్, మీసాల మధుకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
 
Spread the love