బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిరసన
మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
నవతెలంగాణ-అంబర్‌పేట/ ముషీరాబాద్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ, ఐద్వా, పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో వేర్వేరుగా ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆపార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి మాట్లాడారు. బండి భగీరథ్ పరారీలో ఉండటం ఆశ్చర్యా నికి గురి చేస్తున్నదన్నారు. మైనర్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఎఫఆర్ చేయడానికి, పోక్సో కేసు నమోదుకు కూడా రాష్ట్ర పోలీసులు మీనమేషాలు లెక్కించారన్నారు. పోక్సో లాంటి కఠినమైన కేసులో కూడా నిందితున్ని అరెస్టు చేయకుండా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని విమర్శి ంచారు. బాధితురాలిపైనే పోలీస్ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. బండి భగీరథ్‌ను మైనర్ హనీట్రాప్ చేసిందనడం, డబ్బుల కోసమే ఇదంతా చేస్తు న్నారనడం మహిళల పట్ల వారి వైఖరిని, వారి దిగజారుడుతనాన్ని తెలియ జేస్తోందన్నారు. గత ఆదివారం జరిగిన మోడీ సభలో పక్కపక్కనే కూర్చున్న సీఎం రేవంత్‌రెడ్డి బండి సంజరును ఉద్దేశించి మాట్లాడుతూ.. తన ప్రియమైన మిత్రుడు అని సంబోధించడం చూస్తే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ కేసుకు ప్రత్యేక అధికారిగా నియమితులైన డీసీపీ మాట్లాడిన సందర్భంలో బండి భగీరథ్‌ది తప్పని తేలితే అరెస్టు చేస్తామని చెప్పడమేంటని ప్రశ్నిం చారు. తప్పు, ఒప్పులు నిర్ణయించేది న్యాయస్థానం అని, పోక్సో కేసు ఉన్న నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరుని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. బండి సంజరు తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదం టున్నారనీ, మరి ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావు, ఎం.మహేందర్, కె.నాగలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్, జె.కుమారస్వామి, ఎన్.మారయ్య, జి.నరేష్, జి.కిరణ్, కె.అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన
ఫోక్సో కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథను వెంటనే అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేయాలని ఐద్వా, పీఓడబ్ల్యూ, పీఓడబ్ల్యూ-2, ఏఐఎంఎసఎస్, ఎనఎఫఐడబ్ల్యూ, టీయూసీఎల్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసి ఆరు రోజులు గడిచినా నిందితుడిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 17 ఏండ్ల బాలికను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని కేసు నమోదైనప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజరు కేంద్ర మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు సంధ్య మాట్లాడుతూ.. బండి భగీరథపై గతం లో కూడా ర్యాగింగ్, డ్రగ్స్ వినియోగం వంటి ఆరోపణలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయని, అధికార అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ-2 రాష్ట్ర అధ్యక్షులు స్వరూప, ఏఐఎంఎసఎస్ రాష్ట్ర కన్వీనర్ హేమలత, ఎన్‌ఎఫ్‌ఐ డబ్ల్యూ రాష్ట్ర నాయకులు హైమావతి, నాయకులు మాధవి, ఐద్వా సహాయ కార్యదర్శి ఆశాలత, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు ఝాన్సీ, లక్ష్మీబాయి, వర లక్ష్మి, సీఎంఎస్ రాష్ట్ర నాయకులు జ్యోతి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



