బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్

న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు కొత్త జాతీయ కార్యవర్గ సభ్యులను బీజేపీ శనివారం ప్రకటించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి జాతీయ కార్యవర్గంలో మార్పులు చేర్పులను చేశారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సెక్రటరీలుగా ఉన్న ఎక్కువ మంది ఆఫీసు బేరర్లను కొత్త జాబితాలో కొనసాగించారు. మొత్తంగా 13 మంది ఉపాధ్యక్షులు, తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది సెక్రటరీలు ఈ జాబితాలో ఉన్నారు. తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు కొత్తగా ఇద్దరు రాగా, ఏడుగురు పాతవారే తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. రాష్ట్ర ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, చత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి సివి రమణ్‌ సింగ్‌లకు జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజరును ప్రధాన కార్యదర్శిగా నియమించారు. యూపీ నుంచి రాథామోహన్‌ అగర్వాల్‌, రాజస్థాన్‌ నుంచి సునీల్‌ బన్సాల్‌, మధ్యప్రదేశ్‌ నుంచి కైలాష్‌ విజయవర్గీయలకు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో నియమించారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌ను జాతీయ కార్యదర్శిగా, తెలంగాణకు చెందిన డికె అరుణను జాతీయ ఉపాధ్యక్షులు నియమించారు.

Spread the love