బార్ధాన్ కార్మికుల సమ్మె..

– యాజమాన్యం నుండి వైఖరి వీడి చర్చలు జరపాలి
– భార్ధాన్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు  మల్యాల గోవర్ధన్ డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
బార్ధన్ కార్మికుల కూలి రేట్లు పెంచాలని కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేసి, కార్మిక శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భార్ధాన్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూలి రేట్ల పెంపు ఒప్పందం జరుగుతుంటే, ఈసారి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ కూలి రేట్లు పెంచబమని తెలపడంతో కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని, యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని అన్నారు, బార్ధాన్ కార్మికుల సమ్మె విరమణకు కార్మిక శాఖ అధికారులు చొరవ చూపి, చర్చలు జరిపి కూలి రేట్లు మరియు ఇతర డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దండే రాము, నాయకులు అబ్దుల్, విజయ్, రాజు, సురేష్, గంగాధర్, కరుణబాయి, భారతి, బార్దన్ కార్మికులు పాల్గొన్నారు.
Spread the love