– బీసీ సంక్షేమ సంఘం
– ములుగు జిల్లా అధ్యక్షులు భిక్షపతి
నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్రంలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలకు అసెంబ్లీలో 60 టికెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు చింత నిప్పుల బిక్షపతి రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీసీల సమావేశం జరిగింది. చింతనపుల బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 10న హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే బీసీల సింహగర్జన సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాజ్యాధికారంలో మన వాటా దక్కకుండా చేస్తున్న అగ్రకుల కుట్రలను బద్దలు కొట్టాలని విజ్ఞప్తి చేశారు. బీసీల సింహగర్జన విజయవంతం చేసి మన ఓటు మనకు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రశేఖర్, బక్తోజు బ్రహ్మచారి, మోదాల సైదులు సంఘ సురేందర్, కోడి మల్లయ్య, చల్ల ప్రసాద్, సిగ్గోజు రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.