సీజనల్ వ్యాధుల పట్ల ప్రమాదంగా ఉండాలి

– సామాజిక మహిళ న్యాయవేదిక ములుగు జిల్లా అధ్యక్షురాలు మండే పూర్ణిమ
– ఏజెన్సీ గ్రామాల్లో హెల్త్ క్యాంపు నిర్వహించాలి
నవతెలంగాణ -తాడ్వాయి
ఏజెన్సీ  గ్రామాల్లో  ప్రజలు ఈ వర్షాకాల సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తద్వారా ఆరోగ్యంగా ఉండాలని సామాజిక మహిళ న్యాయవేదిక జిల్లా అధ్యక్షురాలు మడేపూర్ణిమ అన్నారు. మండలంలోని భూపతిపురం, సింగారం గ్రామాలను పర్యటించారు. పాఠశాలకు వెళ్లి పిల్లలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మరి పూర్ణిమ మాట్లాడుతూ వర్షాలు ముసురు కొడుతున్న కారణంగా వ్యాధులు ప్రవళి అవకాశం ఉందని గ్రామాల్లో బ్లీచింగ్ నిర్వహించాలని, వైద్యశాఖ అధికారు లు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. వర్షాకాలం స్టార్ట్ అయిన హెల్త్ క్యాంపు ల విషయంలో ఆరోగ్యశాఖ నత్తనడక నడుస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో సీజన్లో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన పెద్దమనుషులు, తల్లడి లక్ష్మయ్య, తాటి మల్లయ్య, సిఎస్టి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మడే బిక్షపతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love