
– అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలసత్వంతో రోడ్లు గుంతలమయం
నవతెలంగాణ – చండూరు
చండూరు మున్సిపల్ కేంద్రం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పడమటితల గ్రామం ఉంటుంది. ఇక్కడ సుమారుగా 500 మందిగా జీవం సాగిస్తున్నారు. ఎక్కువ వీళ్ళ జీవన వృత్తి వ్యవసాయం తర్వాత కూలిపండ్లకు ఎక్కువగా వెళుతుంటారు. మరి కొంతమంది జడకట్లకు, చెరుకు కోత పనులకు ఆంధ్రకు వలస పోతుంటారు. అయితే ఇక్కడ డ్రైనేజీ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. వర్షం వచ్చిందంటే చాలు రోడ్లని చంద్రవంతరంగా తయారవుతాయి. అధికారుల నిర్లక్ష్యం,పాలకుల అలసత్వంతో ఏక్కడ చూసిన బురద మయంగా మారింది. ముఖ్యంగా చండూరుకి వెళ్లే రోడ్డు గుంతలు, గుంతలుగా మారి అధ్వానంగా తయారైంది. రోడ్డు కూడా చండూరుకు రావాలని ఆ గ్రామస్తులు నరకయాత్న పడుతున్నారు.
కోటి ఎనబై లక్షలు నిధులు మంజూరు..
మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చండూర్ మెయిన్ రోడ్డు నుండి పడమటితల గ్రామంలోపాటి వరకు సిఆర్ఆర్ నిధులచే కోటి ఎనబై లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అక్టోబర్ 2 2023 అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గవర్నమెంట్ ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. గెలిచిన నాటినుండి 8 నెలలు కావస్తున్న ఇప్పటివరకు కూడా రోడ్డు పనులు మొదలు కాలేదు. దీంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలకు గురవుతున్న స్థానికులు
చిన్నపాటి వర్షానికి కూడా రోడ్డు అంత చిత్తడిగా మారుతుంది. రోడ్ అంతా బురదమయం, నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి , మరి చీకట్లో వెళ్లాలంటే బైక్ లపై, ఆటోలో వెళ్తుండగా జారిపడి గాయాలు అయిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ ఏ గుంత ఉందో అనీ భయంతో అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మంజూరైన నిధులు తో బిటి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కోటి ఎనబై లక్షలు బి ఆర్ ఎస్ ప్రభుత్వం బిటి రోడ్డు కు నిధులు మంజూరు చేయించింది
గాలెంక రాంబాబు …. బిఆర్ఎస్ నాయకుడు,
కోటయ్య గూడెం
అప్పటి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోటి ఎనబై లక్షలు నిధులు మంజూరు చేయించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని పనితో ఇప్పటివరకు ఎనిమిది నెలలు కావస్తున్న ఇప్పటివరకు పనులు చేపట్టలేదు.చినుకు పడితే చాలు రోడ్ అంతా గందరగోళంగా ఉంటుంది. మురికి కాలు కూడా సరిగా లేవు, ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించి పడమటి తాళ్లకు గ్రామానికి బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలి.
