బ్యూటీ షూటింగ్‌ షురూ

బ్యూటీ షూటింగ్‌ షురూడైరెక్టర్‌ మారుతి టీమ్‌ ప్రోడక్ట్‌, వానరా సెల్యూలాయిడ్‌ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్‌ ప్రధాన పాత్రలో అంకిత్‌ కొయ్య, విశాఖ ధిమన్‌ హీరో, హీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం ‘బ్యూటీ’. బాల సుబ్రహ్మణ్యమ్‌ దర్శకత్వంలో ఎ.విజరు పాల్‌ రెడ్డి నిర్మాతగా, ప్రకాష్‌ రౌతు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో జరిగాయి. దర్శకుడు మారుతి క్లాప్‌ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీర శంకర్‌, సుబ్బు మంగాదేవి, డార్లింగ్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎమోషనల్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం మే రెండు నుండి హైదరాబాద్‌ పరిసర పాంతాల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. విజరు బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిద్ధం మనోహర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటర్‌గా, సురేష్‌ భీమగాని ఆర్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Spread the love