- Advertisement -
సీజీఎం, ఎడిటర్ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక జనరల్ డెస్కు సబ్‌ఎడిటర్ రమకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి లొట్టపల్లి సత్యం (70) గుంటూరు జనరల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి చనిపోయారు. సత్యంకు భార్య వెంకాయమ్మ, కూతురు రమ ఉన్నారు. సత్యం మృతికి నవతెలంగాణ దినపత్రిక చీఫ్ జనరల్ మేనేజర్ పి.ప్రభాకర్, ఎడిటర్ ఆర్.రమేశ్, మేనేజర్లు, ఎడిటోరియల్ బోర్డు మెంబర్లు, సిబ్బంది సంతాపం తెలిపారు. సత్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -



