నవతెలంగాణ – శాయంపేట: పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండలంలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించి ముందు వరసలో నిలిచారు. జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాల నుండి బాసని అన్విత 560/600, సోషల్ వెల్ఫేర్ బాలికల విద్యాలయం నుండి వర్షహాసిని 581/600, కేజీబీవీ పాఠశాల నుండి అక్షర 568/600, నవోదయ పాఠశాల నుండి నేత్ర 562/600 మార్కులు సాధించారు. విద్యార్థుల కృషి క్రమశిక్షణ వల్లనే ఉత్తమ ఫలితాలు సాధించినట్లు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత రజని మాధవి పృద్వి తెలిపారు. ఉపాధ్యాయుల కృషి కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ ఉపాధ్యాయులు శేఖర్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు
పది లో ఉత్తమ ఫలితాలు.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



