మాల మహానాడు జాతీయ కార్యదర్శిగా భాస్కర్ నియమకం

– జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్
నవతెలంగాణ – నెల్లికుదురు
జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శిగా నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన ఆశోద భాస్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్  తెలపడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించినట్లు జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ తెలిపాడు హైదరాబాదులోని ఆయన నియామకం సందర్భంగా భూకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల సమస్యల పరిష్కరించడం పై కొన్ని ఏళ్ల నుండి ఎన్నో పోరాటాలు చేశాడని ఎన్నో పదవులు చేపట్టి ఎంతో మంది అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు హైదరాబాదులో మాల మహానాడు జాతీయ కార్యదర్శిగా ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ రావు కి రుణపడి ఉంటామని అన్నారు. రానున్న రోజుల్లో కూడా మాలల అభివృద్ధి కోసం మా మండలం ఎంతో ముందుండి సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ జాతీయ ఉపాధ్యక్షుడు బాబురావు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరు రమేష్ తో పాటు కొంతమంది ఉన్నారు.
Spread the love