హస్తం గూటికి చేరిన భూక్యా సుమలత

నవతెలంగాణ – గోవిందరావుపేట
బీ.ఆర్.ఎస్. పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి భూక్య సుమలత తన పదవికి రాజీనామా చేసి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మండలం లోని పస్ర గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకురాలు మరియు బి.ఆర్.ఎస్. పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి భూక్యా సుమలత  తన బి.ఆర్.ఎస్.పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మాత్యులు దనసరి సీతక్క  చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిక అయ్యారు. మంత్రి సీతక్క  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, సహకార సంఘం అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు కాడబోయిన రవి, వెంకటేష్, జక్కు రణదీప్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love