తెలంగాణ రెడ్డికా ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ

నవతెలంగాణ- నవీపేట్: తెలంగాణ రెడ్డిక కుల ఆత్మగౌరవ భవన భూమి పూజ కార్యక్రమాన్ని హైదరాబాదులోని ఉప్పల్ బాగాయత్ లో బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంచార జాతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పద ఎకరాల భూమి, పది కోట్లు కేటాయించడం జాతుల అదృష్టమని అన్నారు. సంచార జాతుల ప్రతినిధులతో కలిసి భవన నిర్మాణంపై చర్చించి అన్ని కులాలకు అనుకూలంగా నిర్మించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డికా కులస్తులు, ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, కార్యనిర్వాహక అధ్యక్షులు అశోక్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పంతులు అరుణ్, ఎంపీటీసీ సాయి రెడ్డి, యంచ సర్పంచ్ కొట్టాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love