బసవపురంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన భువనగిరి ఎంపీపీ

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో శుక్రవారం భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ రూ.10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కుల వెంకటేశం, భువనగిరి మండల బీసీ సెల్ అధ్యక్షులు మచ్చ నరసింహ గౌడ్, మాజీ సర్పంచ్ ఉడుత సత్యనారాయణ, మాజీ వార్డ్ నెంబర్ రాసాల నరసింహ, మాజీ ఉపసర్పంచ్ మోత్కుపల్లి యాదగిరి, బిపి ఎం సత్యనారాయణ, గాండ్ల నరసింహ, మచ్చ మధు, మచ్చ శ్రీశైలం, రాంపల్లి నరేష్, ఉత్త నరేష్, నరాల బాలయ్య, బొజ్జ వెంకటేశం, మచ్చ  బాలయ్య లు పాల్గొన్నారు.
Spread the love