వలిగొండలో బీఆర్ఎస్ కి భారీ షాక్…

– కుంభం అనిల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి భారీ చేరికలు..
– ఖాళీ అవుతున్న కారు…
నవతెలంగాణ భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వైయస్సార్ గార్డెన్లో గురువారం వలిగొండ మండల బీఆర్ఎస్ పార్టీకి చెందిన వలిగొండ మాజీ సర్పంచ్ పబ్బు ఉపేంధర్ బోస్ తో పాటుగా సుమారు 500 మందితో కాంగ్రెస్ లోకి చేరారు. వారికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారితో పాటు వెలివర్తి మాజీ సర్పంచ్ మల్లం శ్రీను , ఎం తుర్కపల్లి వాస్తవ్యులు వెలిమినేటి సత్యనారాయణ (మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ) వారి అనుచరులతో కాంగ్రెస్ లో చేరగా వారిని పార్టీలోకి కండువా కప్పి స్వాగతించారు. పార్టీ బలం రోజురోజుకి పెరుగుతుందని ఇది శుభ సంకేతమని, అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అదికారం లోకి తీసుకురావాలని కాంగ్రెస్ శ్రేణులని కోరారు. ఈసారి భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, ఈ విషయంలో తనకి పూర్తి నమ్మకముందన్నారు. ప్రతీ ఒక్కరు పార్టీ గెలుపు కోసం కార్యాచరణ సిద్ధం చేసి కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని ఓడించి కుటుంబ పాలనకి స్వస్తి పలకాలనీ కార్యకర్తలకి, నాయకులకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love