
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య పుట్టినరోజు వేడుకలు శుక్రవారం మత్స్యశాఖ భూపాలపల్లి జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, ఎడ్లపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జంగిడి సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,స్వీట్లు పంచారు. రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. రాజయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఎస్టీ సెల్ యూత్ నాయకుడు సవేందర్, బోయిని రాజయ్య యాదవ్,గట్టయ్య,కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి నస్ఫురి నాగరాజు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.