ఘనంగా మాజీ సీఎం కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్టీసీ చైర్మన్ ,నిజామాబాద్ రూరల్ బీఅర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు శనివారం డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల బీఆర్ఎస్ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిచ్ పల్లి లోని 30 పడకల ఆసుపత్రి ఎదుట కేక్ కట్చేసి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం అసుపత్రిలో రోగులకు పండ్లు పంపీణి చేశారు.ఇందల్ వాయి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, బీఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి గంగదాస్ లో అద్వర్యంలో రెండు కెక్ లను కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాజిరెడ్డి గోవర్ధన్ కు నాయకులు ఫోన్లో శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ హుస్సేన్, ఎస్సీ సెల్ రూరల్ కన్వీనర్ పాశం కుమార్, ఎంపీటీసీ చింతల దాస్, కచ్చకాయల శ్రీనివాస్, అరటి రఘు, బిరీష్ శేట్టి, మోహన్ నాయక్, దాస్, సంజీవ్ రెడ్డి, రాంరెడ్డి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love