కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు.. 

State presidents of colleges Suryanarayana Reddy's birthday celebrations..నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణ వివిధ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాగృతి,విద్యసంస్థల అధినేత, డిగ్రీ,అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా,బొజ్జ సూర్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు జాగృతి డిగ్రీ కళాశాల లో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పలువురు పుష్ప గుచ్చాలు అందజేసి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలపారు.అనంతరం వారు మాట్లాడుతూ పేద విద్యార్థులను ఆదుకుంటు వారిని ఉన్నత స్థాయిలో తీర్చి దిద్ది పెద్ద పెద్ద ఉద్యోగాలలో స్థిర పడడానికి కారకులైన సూర్యనారాయణ రెడ్డి ని అభినందించారు. ప్రైవేట్ కళాశాల కు అండగా ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం,దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్న బి ఎస్ ఎన్ ఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సదా వర్ధిల్లాలని ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకో వాలని మనసారా ఆకాంక్షించారు.ఈ జన్మదిన వేడుకల్లో వైష్ణవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మధిర మల్లేశం,శీల పరశురామ్ పద్మావతి ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్,చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ కొండల్ రెడ్డి,సాయి కృప కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్,అధ్యాపకులు మహేందర్ పాల్గొన్నారు.
Spread the love