ఆశీర్వదించండి మరింత అభివృద్ది చేస్తా:ఎమ్మెల్యే

నవతెలంగాణ – మాక్లూర్
ఇప్పటి వరకు అనేక రకాలుగా ప్రతి గ్రామానికి ఎన్నో రకాలుగా అభివృద్ది కార్యక్రమాలు చేశామని, మళ్ళీ ఆశీర్వదిస్తూ మరింత అభివృద్ధి చేస్తానని ఆర్మూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే, బి అర్ ఎస్ జిల్లా అధ్యక్షులు, పియుసి చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. బుదవారం మండలంలోని గుంజీలు గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా గుంజీలు గ్రామంలో నూతన రామాలయ నిర్మాణానికి రూ. 35 లక్షలు, మల్టీ పర్ పస్ పంక్షన్ హల్ నిర్మాణానికి శిలాఫలకం ప్రారంభించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంజిలి గ్రామంలోఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల ద్వారా చేసిన అభివృద్ధిని వివరించారు. కళ్యాణ లక్ష్మి, సాది ముబరక్, అసరా పించాన్, మహిళ సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, గ్రామంలో సిశి రోడ్లు, డ్రైనేజీలు, బిటి రోడ్డు లాంటి పనులను చేశామని గ్రామస్థులకు తెలియజేశారు. గ్రామంలోని ప్రతి కుల సంఘానికి రూ. 5 లక్షల చొప్పున కమ్యూనిటీ హల్ నిర్మాణానికి ఇస్తున్నట్లు తెలిపారు. ముచ్చటగా మూడో సారి గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శేకర్, మండల ఎంపిపి మస్త ప్రభాకర్, ఎంపిటిసి సుజాత నవీన్, సొసైటీ ఛైర్పర్సన్ గోపి లక్ష్మి, జివన్నన్న యువసేన అధ్యక్షులు గొపు రంజిత్, వివిధ గ్రామాల సర్పంచ్ లు అశోక్ కుమార్, లింగం, సుబ్బారావు, నాయకులు శ్యామ్ రావు, కరీం, ఎంపీడీఓ క్రాంతి, తహశీల్దార్ షబ్బీర్, అర్ ఐ శపి, సిఐ సతీష్, ఎస్సై సుదీర్ రావు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Spread the love