Sunday, August 23, 2026
E-PAPER
Homeసమీక్షఆనందం - పరమానందం - బ్రహానందం

ఆనందం – పరమానందం – బ్రహానందం

- Advertisement -

బాల్య ఎవరికైనా ఆనందమే! చిన్నతనపు చిన్న చిన్న సరదాలు, అనుభూతులు మరొకరితో పంచుకోవటం పరమానందమే! ప్రతి వ్యక్తికి బాల్యం ఉంటుంది. ఆ బాల్యంలోని సంఘటనలు, అప్పటి దాకా అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నా తమ్ముళ్ళతోనే లోకం, బడిలో చేరగానే ఆ బాల్యం కాస్తా విస్తతం అవుతుంది. తోటి ఈడు పిల్లలు, బడి, బడిగంట, పుల్లయిసులు, పీచుమిఠాయిలు, చిన్న చిన్న దొంగతనాలు, ఏడ్పించటాలు నవ్వుకోవటాలు.. వీటన్నింటికి సాక్షీభూతం అవటం బ్రహ్మానందమే!
గాజుల పల్లి (చిత్తూరు) వాసి మేదరమెట్ల చక్రధర్‌ నాయుడు ఎం.ఎస్సీ, బిఈడి. సొంత ఊళ్ళో స్కూలు నడుపుతారు. మదుస్వభావి, స్నేహశీలి. మధ్యతరగతి కుటుంబంలో ఉండే బాల్యానుభవాలు అందరిలాగే ఈ రచయితకు కూడా ఉన్నాయి. వాటిని ఈ ‘ఉప్మా బ్యాచ్‌ (ఇతర కథలు)’ సంకలనంగా 21 కథలుగా రూపు దిద్ది మనకందిస్తున్నారు.

‘కథలు’ అంటే సామాన్యంగా కల్పనలోంచి పుట్టినవై ఉంటాయి. ‘ఉప్మా బాచ్‌’లోని కథలు నిజానికి కథలు కావు, రచయిత బాల్యానుభవాలు. స్కూల్లో పలకలు పగుల గొట్టుకోవడం, తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోవటం, మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా ఉప్మా వండటం, వడ్డించటం. ఆరనాళ్లకు వెళ్ళటం, పుల్లయిసులు చప్పరించటం… ఇలాంటి అనుభవాలు అందరికీ సాధారణమే. అందుకే చక్రధర్‌ కథల్ని చదువుతోంటే చాలా మంది పాఠకులకు తమ బాల్యం గుర్తుకు వస్తుంది. ‘అరే! ఇది నా అనుభవమే!’ అనుకుంటూ ఈ కథలతో ‘కనెక్ట్‌’ అవుతారు. 1960 ప్రథమార్థంలో, అంతకు ముందు పుట్టిన పాఠకులకు ఈ కథలు మామూలుగానే అనిపించవచ్చు. కానీ 1990, ఆ తర్వార జన్మించిన పాఠకులకు ఆపురూపమైన కధనాలు. ఊరికి దూరంగా విశాలమైన ప్రాంగణాలలో ఉంటూ ప్రకతిలో మమేకమైన ఆనాటి స్కూళ్లు నేటి విద్యార్థులకు కొత్తగా అనిపించి ఆనందం కలిగిస్తాయి. ముందుమాటలో రచయిత, అనువాదకులు పలమనేరు పలమనేరు బాలాజీ అన్నట్లు ‘మనల్ని మనం వెదుక్కోవటానికి, కనుక్కోవటానికి, మిగుల్చుకోవటానికి ‘ఉప్మా బ్యాచ్‌’ పుస్తకం దారి చూపుతుంది. చివరి రెండు, మూడు అధ్యాయాలు రచయిత అనుభవాలనే యధాతథంగా దించారు. వీటిలోని సహజత్వం, నిజాయితీ, పాఠకులను ‘ఇంప్రెస్‌’ చేస్తుంది. ‘Americaμs youngest Ambassador’ గా పేరుగాంచిన సమంతాస్మిత్‌ పేరున తను స్కూలు నెలకొల్పటం, పేద విద్యార్ధులకు విద్యాదానం చేయటం రచయితలోని మానవత్వం తెలుపుతుంది. ఎన్నాళ్ళయినా, పాతబడని ‘కథ’లివి. రచయితకు అభినందనలు. చక్కని ముద్రణ, బొమ్మలు ముచ్చట గొలుపుతాయి.

కూర చిదంబరం, 8639338675

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -