‘ఓటరు జాబితా తయారీలో బీఎల్‌ఓలే కీలకం’

నవతెలంగాణ-తుర్కయాంజల్‌
ఓటరు జాబితా తరిలో బీఎల్‌ఓలే కీలకమని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటా చారి అన్నారు. శుక్రవారం తుర్కయాంజల్‌ లోని ఆర్డీఓ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితాపై వారి సూచనలు సలహాలను స్వీకరించారు.అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ఓటరు జాబితా తయారు చేయాలని బీఎల్‌ఓ లకు సూచించారు. బీఎల్‌ఓలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల లాంటివారని, ఓటరు జాబితాను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఓటరు తొలగింపులో జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. బీఎల్‌ఓలు తమ కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వహించినప్పుడే పారదర్శక మైన ఓటరు జాబితా తయారౌతుందని తెలిపారు.పోలింగ్‌ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్ల కొరకు ప్రత్యేకమైన పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, సీపీఐ తుర్కయాంజల్‌ బాద్యులు ఒరుగంటి యాదయ్య, అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండల జెడ్పీటీసీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బింగి దాసు, ఎమ్మారో అనిత, యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల ఎమ్మార్వో లు, వివిధ మండలాల బీఎల్‌ఓ లు పాల్గొన్నారు.

Spread the love