Monday, July 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరక్తానికి రక్తం !

రక్తానికి రక్తం !

- Advertisement -


ఇరాన్‌లో వెలసిన హోర్డింగులు
శవపేటికలపై ట్రంప్, కుటుంబసభ్యుల చిత్రాలు
టెహ్రాన్ :
అమెరికా యుద్ధోన్మాదంపై ఇరాన్ నాయకత్వం, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెహ్రాన్ నగరం నడిరోడ్డున ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్ ప్రజాగ్రహానికి అద్దం పడుతోంది. అమెరికా పతాకంతో కప్పిన శవపేటికల పైన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల చిత్రపటాలను చూపుతూ హోర్డింగును ఏర్పాటు చేశారు. అమెరికా నాయకుడిని లక్ష్యంగా చేసుకొని ఏర్పాటు చేసిన వ్యక్తిగత ప్రదర్శనలలో ఇది ఒకటిగా నిలుస్తోంది.
అమెరికా అధ్యక్షభవనాన్ని నేపథ్యంగా చేసుకొని పాలస్తీనా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్‌పై ‘రక్తానికి రక్తం’ అనే నినాదం రాసి ఉంది. ఇరాన్ సీనియర్ నేతలను, వారి కుటుంబాలను హతమార్చిన అమెరికా దాడులకు ప్రతీకారంగా ట్రంప్ కుటుంబానికి హెచ్చరిక సంకేతంలా దీనిని ఏర్పాటు చేశారు.
శవపేటికలపై ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, వారి సంతానం ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, టిఫనీ ట్రంప్, బారన్ ట్రంప్ నిలబడి ఉన్నట్లు హోర్డింగులో చూపారు. ఇరాన్ దివంగత నేత అయతొల్లా అలీ ఖమేనీ కుటుంబంపై యుద్ధం చూపిన ప్రభావానికి ప్రతిస్పందనగా దీనిని ఏర్పాటు చేసినట్లు కన్పిస్తోంది. కాగా ఎంగెలాబ్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన మరో హోర్డింగులో… నల్లని శవపేటికలో ట్రంప్ కళ్లు మూసుకొని పడుకొని ఉన్నారు. ఆయన జుట్టు చెదిరి ఉంది. దాని కింద ‘మేము ట్రంప్‌ను చంపేస్తాం’ అని ఆంగ్లంలో, పర్షియన్ భాషలో రాశారు. ట్రంప్ ముఖంపై తుపాకీని ఎక్కుపెట్టినట్లు మరో హోర్డింగులో చూపారు. రెండు రోజుల క్రితం అమెరికాలో రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రహం మరణించిన విషయం తెలిసిందే. ఆయన పేరు కింద ‘తర్వాత ఎవరు?’ అని రాసిన ఓ పోస్టర్ కూడా కన్పిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -