ఉప్పొంగిన బొగత జలపాతం

– 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న
– నీటి ప్రవాహం
నవతెలంగాణ-వాజేడు : ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొన్న పచ్చటి ప్రకృతి అందాల జలపాతం బొగత. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీటి ప్రవాహ ఉధృతి పెరిగి 50 అడుగుల ఎత్తు నుంచి తెల్లటి పాలనురగలా జలపాతం జాలువారుతోంది. దాంతో పర్యాటకులను జలపాతం కట్టి పడేస్తుంది. ఏటా వర్షాకాలం సీజన్‌లో జలపాతాన్ని సందర్శిం చడానికి మూడు రాష్ట్రాల ప్రజలు సుదూరా ప్రాంతాల నుంచి వస్తారు. పర్యాటకుల కోసం ఫారెస్ట్‌శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టారు. జలపాతంలో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలూ చేపట్టింది.

Spread the love