ముంబైలో 11చోట్ల బాంబులు పెట్టాం.. ఆర్బీఐకి బెదిరింపులు

నవతెలంగాణ – హైరదాబాద్:
ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆర్‌బీఐ తో పాటు హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బీకేసీ టవర్స్ సహా 11 చోట్ల బాంబులు పెట్టామని, వాటిని పేల్చివేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపు లేఖ పంపారు. అలాగే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు రాజీనామా చేయాలని దుండగులు డిమాండ్ చేశారు. ముంబైలోని 11 ప్రాంతాల్లో తాము పెట్టిన బాంబులు మధ్యాహ్నం 1.30 గంటలకు పేలుతాయని దుండగులు పేర్కొన్నారు. దుండగుడు పంపిన లేఖలో ఇలా వుంది .. ‘‘ప్రైవేట్ బ్యాంక్‌లతో కలిసి రిజర్వ్ బ్యాంక్ దేశంలో భారీ కుంభకుణానికి పాల్పడింది. ఈ కుంభకోణంలో ఆర్‌బీఐ గవర్నర్, కేంద్ర ఆర్ధిక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు, పలువురు కేంద్ర మంత్రులు భాగస్వాములుగా వున్నారు. వారంతా తక్షణం రాజీనామా చేస్తే కుంభకోణం వివరాలు బయటపెడతాం. మధ్యాహ్నం 1.30 గంటల లోపు వారి పదవులకు రాజీనామా చేయకుంటే ముంబైలోని 11 చోట్ల ఏర్పాటు చేసిన బాంబులు పేలుతాయని  ’’ అని ఆర్‌బీఐకి పంపిన లేఖలో ఆగంతకులు హెచ్చరించారు

Spread the love