Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్వకుంట్ల కవితకు భైరపాక రాసిన పుస్తకాలు అందజేత

కల్వకుంట్ల కవితకు భైరపాక రాసిన పుస్తకాలు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్ : తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాప అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను, ఆలేరుకు చెందిన యువకవి, రచయిత భైరపాక స్వామి ఆదివారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి, ఆమెకు తాను రాసిన గ్రాంథాలను అందజేశారు. భైరపాక రాసిన తెలుగు పతాక కవితా సంపుటి, తెలంగాణ పల్లెపాట కవితా సంపుటి, ఆకలి మంటలు కవితా సంపుటి పుస్తకాలను పరిశీలించిన కల్వకుంట్ల కవిత చిన్న వయస్సులోనే భైరపాక పెద్ద పెద్ద సాహిత్యపరులతో పోటీపడుతున్నారనీ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సాహిత్య గ్రంథాలు భైరపాక కలంలోంచి వెలువరించాలనీ  సూచించారు. తమ సహకారం భవిష్యత్తులో ఎప్పటికీ ఉంటుందనీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -