బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రజల జీవితాల్లో వెలుగులు

– కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్..
– ఆమనగల్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం..
– చేసిన అభివృద్ధి పనులను వివరించి తనను మరోసారి గెలిపించాలని పిలుపు..
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్ లో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పొనుగోటి అర్జున్ రావు, నేనావత్ పత్య నాయక్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అధిష్టానం ఆదేశాల మేరకు కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా అసెంబ్లీకి పంపించాలని కోరారు. అందుకోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా చిత్తశుద్ధితో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆమనగల్ పట్టణంతో ఆయా గ్రామాల్లో చేపట్టిన, కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి వారిని చైతన్య పర్చాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్య నాయక్, వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, ఏఎంసీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మెన్ తోట గిరి యాదవ్, కౌన్సిలర్లు కమటం రాధమ్మ వెంకటయ్య, సోనా జైరామ్ నాయక్, నాయకులు ఖాదర్, సయ్యద్ ఖలీల్, అప్పం శ్రీను, చుక్క నిరంజన్ గౌడ్, వడ్డే వెంకటేష్, పూసల సత్యం, విఠాయిపల్లి రమేష్, రజ్జాఖ్, కొమ్ము ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love