Monday, July 20, 2026
E-PAPER
Homeఆటలుఇంగ్లాండ్‌కు కాంస్యం

ఇంగ్లాండ్‌కు కాంస్యం

- Advertisement -

ఇంగ్లాండ్‌‌ 6-4తో విజయం
ఫిఫా 2026 ప్రపంచకప్‌

మయామి (యుఎస్‌ఏ)
ఏ జట్టూ ఆడాలని కోరుకోని మ్యాచ్‌‌లో అంతిమంగా గోల్స్‌ ‌వర్షం కురిసింది. ఫిఫా ప్రపంచకప్‌ ‌కాంస్య పతక మ్యాచ్‌‌లో ఫ్రాన్స్‌‌పై ఇంగ్లాండ్‌ 6-4‌తో ఘన విజయం సాధించింది. పది గోల్స్‌ ‌నమోదైన మ్యాచ్‌‌లో.. ఇంగ్లాండ్‌ ఆటగాడు బుకాయ సకా హ్యాట్రిక్‌ ‌గోల్స్‌‌తో రికార్డు నెలకొల్పాడు. ప్రథమార్థంలోనే 4-0తో త్రీ లయన్స్‌ (ఇంగ్లాండ్) దుమ్మరేపగా.. ద్వితీయార్థంలో ఫ్రాన్స్‌ ‌పుంజుకుంది. నాటకీయత చోటుచేసుకున్న ఆఖరు నిమిషాల్లో ఇంగ్లాండ్‌ ‌గోల్స్‌ కొట్టి పైచేయి సాధించింది. 1966లో ఫిఫా ప్రపంచకప్‌ ‌విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌.. ఆ తర్వాత 2026లో కాంస్య పతకంతో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది.

​ఇంగ్లాండ్‌ ‌దూకుడు
కాంస్య పతక మ్యాచ్‌ (మూడో స్థానం)లో ఇంగ్లాండ్‌ ‌రెచ్చిపోయింది. ఆట మొదలైన మూడో నిమిషంలోనే గోల్‌ ‌ఖాతా తెరిచింది. డెక్లాన్‌ ‌రైస్‌ ‌మూడో నిమిషంలో గోల్‌ ‌కొట్టగా.. ఎజ్రి కోన్సా 18వ నిమిషంలో గోల్‌ ‌నమోదు చేశాడు. బుకాయో సకా 37వ నిమిషంలో గోల్‌‌తో పాటు ప్రథమార్థం స్టాపేజ్‌ ‌టైమ్‌‌లో (45+1)లో గోల్‌ ‌కొట్టాడు. దీంతో ప్రథమార్థం ముగిసేసరికి ఇంగ్లాండ్‌ 4-0‌తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. కిలియన్‌ ఎంబాపె జోరుతో ద్వితీయార్థంలో ఫ్రాన్స్‌ పుంజుకుంది. ఎంబాపె 48, 66వ నిమిషాల్లో గోల్స్‌ ‌కొట్టాడు. ఈ రెండు గోల్స్‌‌తో ప్రపంచకప్‌ ‌చరిత్రలో అత్యధిక గోల్స్‌ ‌కొట్టిన ఆటగాడిగా మెస్సి (21)ని ఎంబాపె (22) వెనక్కి నెట్టాడు. బార్కోలా 54వ నిమిషంలో గోల్‌ ‌చేయగా.. 90+6 నిమిషంలో డెంబెలె గోల్‌ ‌కొట్టాడు. ద్వితీయార్థంలో ఫ్రాన్స్‌ ‌నాలుగు గోల్స్‌‌తో పుంజుకుంది. కానీ ఇంగ్లాండ్‌ ‌మరో రెండో గోల్స్‌‌తో పైచేయి నిలుపుకుంది. 85వ నిమిషంలో పెనాల్టీ కిక్‌‌ను సకా గోల్‌‌గా మలువగా.. 90+8వ నిమిషంలో బెలింగ్‌‌హామ్‌ ‌గోల్‌ ‌కొట్టాడు. ఏడు గోల్స్‌‌తో ఓ వరల్డ్‌‌కప్‌‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ఇంగ్లాండ్‌ ‌ప్లేయర్‌‌గా బెలింగ్‌‌హామ్‌ ‌నిలిచాడు. 2022 ప్రపంచకప్‌ ‌రన్నరప్‌‌గా నిలిచిన ఫ్రాన్స్‌.. 2026ను నాల్గో స్థానంతో ముగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -