తొలి రోజు కాంస్యం

– ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌
బాకు(అజర్‌బైజాన్‌): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ తొలి రోజు పోటీల్లో భారత్‌ కాంస్య పతకం సాధించింది. వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన భారత షూటర్లు.. జట్టు విభాగంలో మెరిశారు. శివ నర్వాల్‌, సరబ్జోత్‌ సింగ్‌, అర్జున్‌ సింగ్‌ చీమలు వ్యక్తిగత మెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో టాప్‌-8లో నిలువలేకపోయారు. కానీ టీమ్‌ ఈవెంట్‌లో చైనా, జర్మనీ తర్వాతి స్థానంలో నిలిచి మెడల్‌ సాధించారు. శివ (579), సింగ్‌ (578), అర్జున్‌ (577) కలిపి 1734 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. మహిళల వ్యక్తిగత విభాగంలో (10 మీ ఎయిర్‌ పిస్టల్‌) ఇషా సింగ్‌, పాలక్‌, దివ్యలు వరుసగా 32, 40, 66వ స్థానాల్లో నిలువగా.. జట్టు విభాగంలో 11వ స్థానంతో సరిపెట్టుకున్నారు.

Spread the love