కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన 200 మంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కార్యకర్తలు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్ రెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే భిక్కనూరు పట్టణంలోని టిడిపి పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ తులసి మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల ఇన్చార్జి నేరెళ్ల శారద ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నందున భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బల్యాల రేఖ, లింబాద్రి, మోహన్ రెడ్డి, సిద్దా గౌడ్, కాంగ్రెస్ పార్టీ కంచర్ల గ్రామ అధ్యక్షులు సాయ గౌడ్, రెడ్డి సంఘం మండల ఉపాధ్యక్షులు రాంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love