
బీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించాలని, ప్రజలకు వివరించాలని సూచించారు. మరోసారి బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారని, ప్రతి కుటుంబానికీ ఏదో విధంగా లబ్ధి చేకూరుతుందని, ఈ విషయాలనే పార్టీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని కోరారు. ఎవరికైనా మనస్పర్థలు ఉంటే వాటిని చర్చల ద్వారా తొలగించుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరు కలిసి సమిష్టిగా పనిచేసి బాన్సువాడ గడ్డపైన గులాబీ జెండా ఎగురవేద్దామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖలీల్ చుంచు సాయిలు, వెంకటేశ్వరరావు, భాను ప్రకాష్ గౌడ్, అజ్గార్ అలీ, మైసాగౌడ్, టీ సాయిలు, భూమయ్య, పోచయ్య, నర్సింలు గౌడ్ మంగళ సాయి, ఫయాజ్, వినయ్, శివ, టి సాయిలు, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.