నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో సర్పంచ్ మీర్జా కలీం బే గ్, ఎంపిటిసి అసాద్ బేగ్, నీల సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారాన్ని చేశారు. బోధన్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షకిల్ ఆమీర్ ను అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మోసిన్ బేగ్, గౌస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.