అవినీతికి కేరాఫ్  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 

– కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్
నవతెలంగాణ- భీంగల్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అవినీతికి కేరాఫ్ గా  నిలిచిందని  దీనిని ప్రజలు గమనిస్తున్నారని  దీంతో ఎన్నికలలో మరోసారి లబ్ది పొందేందుకు  కర్ణాటకలో పథకాలు అమలు కావట్లేదని  తప్పుడు ప్రచారం చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్  ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్  తెలిపారు.  శుక్రవారం భీంగల్ పట్టణంతోపాటు ముచ్కూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ
కర్ణాటక వెళ్లి అక్కడ కాంగ్రెస్ గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో  మంత్రి  తెలుసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్  స్వయంగా చూపిస్తారని తెలిపారు. కాంగ్రెస్  కర్ణాటకలో ఐదు పథకాలను అమలు చేస్తుందని డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని తరువాత 100 రోజుల్లో కాంగ్రెస్  ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని, రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు ఎకరానికి 15000 పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12000 సాయం ప్రతి సంవత్సరం అందిస్తామని తెలిపారు. పసుపు పంటకు 12,000 మద్దతు ధర వరి పంటకు క్వింటాలుకు 500 బోనస్, ప్రతి పంటకు మద్దతు ధరలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆడపిల్లలకు 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళా ఖాతాలో ప్రతినెల 2500 రూపాయలు జమ చేస్తామని తెలిపారు. చేయూత పథకం ద్వారా వృద్ధాప్య పింఛను 4000 వికలాంగ పించను 6000 అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని 2024లో జాబ్ క్యాలెండర్ను ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఆయన తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రోత్సాహాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యా భరోసా పథకం ద్వారా చదువుకోవడానికి 5 లక్షల సాయం మరియు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కోట్ల రూపాయల దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను నిలువునా ఉంచారని తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రశాంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఆయన తెలిపారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love