నిజామాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసింది శూన్యం

– టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ -కంఠేశ్వర్
నిజామాబాద్ ను అన్ని విధాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయోనని, నిజామాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసింది శూన్యమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  విమర్శించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహిర్బీన్ హంధాన్ తో కలిసి ఆయన పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా టి బి సి సి కార్యనిర్వాక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  మాట్లాడుతూ.. నిన్న జిల్లాకు వచ్చిన కేటీఆర్ అహంపూరితంగా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి అని ఆయన మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని, రాజకీయాల్లో కేటీఆర్ ఒక పిల్ల బచ్చా అని కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం చేసిన కృషిని గురించి వాళ్ళ తండ్రి కేసీఆర్ గని అడిగితే తెలుస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సబ్బండ వర్గాల ప్రజలు ప్రజా సంఘాల నేతలు ప్రొఫెసర్ జయశంకర్ గద్దర్ లాంటి నాయకులు విద్యార్థులు అలుపెరగకుండా పోరాటం చేశారని ఆరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టుబట్టి సోనియా గాంధీ తో మన్మోహన్ సింగ్ తో మాట్లాడి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని, అందులో తమరి తండ్రి గారి పాత్ర చాలా చిన్నదని కానీ ప్రత్యేక రాష్ట్రం తామే సాధించామని గొప్పలు చెప్పుకొని అమాయక ప్రజలను మోసం చేశారని ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో అమెరికా నుండి దిగిన కేటీఆర్ కవితకు తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని కేవలం వాళ్ల తండ్రి పేరును అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగారే తప్ప నిజానికి కేటీఆర్ కవితకు అంత సీన్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కొన్ని లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని కాలేశ్వరం పేరిట భూముల, కుంభకోణాల పేరిట, ఇసుక, మైనింగ్, లిక్కర్ దందాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ అవినీతికి పాల్పడి లక్షల కోట్లు సంపాదించిన కుటుంబం దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం కల్వకుంట్ల కుటుంబమేనని, అలాంటి కుటుంబం నుండి వచ్చిన కేటీఆర్ కవిత కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమేనని, అసలు కాంగ్రెస్ పార్టీ పేరును సంబోధించే అర్హత కేటీఆర్ కు లేదని ఆయన మండిపడ్డారు.మరోవైపు నిన్న నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదని చాలా అహంకార ధోరణితో మాట్లాడారని గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జిల్లాకు 20,21వ ప్యాకేజీ ద్వారా అలాగే గుత్ప ఆలీ సాగర్ వంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా జిల్లా ప్రజలకు త్రాగునీటిని సాగునీటిని అందించామని, జిల్లాకు మెడికల్ కాలేజీ తో పాటు ప్రతిష్టాత్మక తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని తాము నిర్మించిన మునిసిపల్ భవనానికి కిటికీలు పెట్టడానికి తమరికి తొమ్మిది సంవత్సరాల సమయం పట్టిందని ఈ ఒక్క ఉదాహరణ చాలు నిజామాబాద్ అభివృద్ధి పై బిఆర్ఎస్ కు ఉన్న చిత్తశుద్ధి తెలిసిపోతుందని ఆయన అన్నారు. కేటీఆర్ కవిత అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా లు ఐటీ హబ్ పేరుతో వాటి చుట్టుపక్కల ఉన్న భూములను కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర లేపారని, ఐటీ హబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కు అక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కనబడలేదని దాదాపు ఒక్క నిజామాబాద్ నగరంలోని 50 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే తమరు ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని, కేవలం 3 ఎకరాల్లో ఒక భవనాన్ని నిర్మించి దానికి ఐటీ హబ్ అని పేరు పెట్టి జిల్లా ప్రజలను మోసం చేయాలని చూడడమే కాకుండా జిల్లాకు వచ్చి కాంగ్రెస్ పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఇకనైనా కేటీఆర్ మాటలను అదుపులో పెట్టుకోవాలని, వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ ను ప్రజలు సాగనంపుతారని గ్రహించి కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్  అహంపూరిత మాటలు మానుకొని ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమర్తి గోపి, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అద్యక్షులు వేణు రాజ్, రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి విపూల్ గౌడ్,జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ,చందూర్ జెడ్పీటీసీ అంబర్ సింగ్,కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా కాంగ్రెస్ ఉపధ్యక్షుడు దయాకర్ గౌడ్,చందూర్ వైస్ ఎంపీపీ దశ గౌడ్,కాంగ్రెస్ నాయకులు ఈసా,చందూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్,నగర మైనారిటీ అధ్యక్షులు అబ్ధుల్ ఏజాజ్,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ,సిరికొండ గంగారెడ్డి,నాగరాజు, ముస్తాఫ తదితరులు పాల్గొన్నారు.
Spread the love