Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజాలు మాట్లాడితే ఉలిక్కి పడుతున్న బీఆర్ఎస్ నాయకులు

నిజాలు మాట్లాడితే ఉలిక్కి పడుతున్న బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉన్నది ఉన్నట్లుగా నిజాలు మాట్లాడితే బిఆర్ఎస్ నాయకులు ఉలిక్కి పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యకురాలు, సర్పంచ్ల ఫోరమ్ అధ్యకురాలు కొండ రాజమ్మతో కలిసి కొయ్యుర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుట్ట మధు అధికారంలో ఉంటే ఒకలా ఉంటడు, అధికారం కోల్పోతే ఎలా మరోలా ఉంటాడని అతని ప్రవర్తన మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజలకు తెలుసన్నారు.

2014 లో మధు ఎమ్మెల్యే అయ్యాక మంథని నియోజకవర్గంలో ఆశాంతి వాతావరణం సృష్టించిన విషయం ప్రజలకు తెలుసన్నారు. ఆయన అనుచరుల ఆగడాలు, దాడులు, హత్యలు, భూకబ్జాలు, దోపిడీలన్ని ప్రజలకు తెలియడాని గుర్తు చేశారు. తమ నాయకులు వాస్తవ వ్యాఖ్యలు చేస్తే బిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు. బిఆర్ఎస్ పది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో తమ జిల్లా దళిత నాయకుడు ఎప్పటికప్పుడు ప్రజావ్యతిరేక విధానాలను ఎండకడుతూ..దళితుల హత్యలను ఖండించిన విషయం గుర్తు లేదాని ప్రశ్నించారు. తమ నాయకులు ఉద్యోగాలు పెట్టిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడలేదని, ఎక్కడ కమిషన్లకు కక్కుర్తి పడలేదన్నారు. నిజాయితీగా జీవిస్తున్న తమపై నాయకులపై అసత్యపు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రుద్రారం సర్పంచ్ చంద్రగిరి సంపత్, కాంగ్రెస్ నాయకులు బొమ్మ రమేష్ రెడ్డి, వేల్పుల రమేష్, రాజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -