- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని చిన్న తడగూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన విభీజీ రాంజీ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహించిన పనులపై శుక్రవారం ఆ గ్రామ సర్పంచ్ సూర్య వంశీ ప్రకాష్ అధ్యక్షతన జీపీ కార్యాలయంలో ఉపాధి హామీ సోషల్ ఆడిట్ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ ఆడిట్ నిర్వహించిన పి రమ్య ఉపాధి పనుల్లో పాల్గొన్న ప్రతి కూలి సోషల్ ఆడిట్ చదివి వినిపించారు. ఈ సోషల్ ఆడిట్ గ్రామ సభలో సర్పంచ్ సూర్యవంశీ ప్రకాష్ గ్రామ పంచాయితీ కార్యదర్శి నర్సింలు, సామాజిక తనిఖీ అధికారులు పి రమ్య, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



