బీఆర్ఎస్ సంక్షేమ పథకాలే.. ఎన్నికల అస్త్రాలు 

– గుగ్గీల్ల ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే రసమయి
నవతెలంగాణ- బెజ్జంకి: 
గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి,ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల అస్త్రాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. గురువారం మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామంలో సర్పంచ్ సీత లక్ష్మి అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హజరవ్వగా గ్రామస్తులు డప్పు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడారు. అమలు కాని హమీలతో కర్ణాటక రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్, మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం చేపట్టాలని చూస్తున్న బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కు సోపానమన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మేజారీటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం యాదవ సంఘం అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎంపీటీసీ కొమిరె మల్లేశం, మండల, గ్రామ బీఆర్ఎస్ నాయకులు హజరయ్యారు.
Spread the love