మామిడ్యాల్‌లో బీఆర్‌టీయూ ఆటో యూనియన్‌ జెండా ఆవిష్కరణ

నవతెలంగాణ-ములుగు
సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడియల్‌ బైలంపూర్‌ గ్రామాలలో బుధవారం ఆటో యూనియన్‌ అధ్యక్షుడు పత్తెపు శివకుమార్‌ ఆధ్వర్యంలో బీఆర్‌టీయూ ఆటో యూనియన్‌ ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్య అతిథిగా ఎంఎల్‌సి యాదవ్‌ రెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, వంటిమామిడి మార్కెట్‌ చైర్మన్‌ జహంగీర్‌, డిసిసిబి డైరెక్టర్‌ బట్టు అంజి రెడ్డి, వంటిమామిడి మార్కెట్‌ వైస్‌ చైర్మెన్‌ కోడూరి భూపాల్‌ రెడ్డి, ఎంపీటీసీ లింగారెడ్డి, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు ఏనుగు బాబు రెడ్డి ఆటో యూనియన్‌ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు మారయ్య, బిఆర్‌టియూ ప్రధాన కార్యదర్శి బాలరాజ్‌ యాదవ్‌ తో కలిసి బిఆర్‌టియూ జెండా ఆవిష్కరణ చేశారు. ఆటో యూనియన్‌ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం తరుపున చొరవ తీసుకోవాలన్నారు . ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికుల తో రాజకీయాలకు అతీతంగా అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు ఆటో రంగాన్ని రక్షించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు.ఇప్పటికే ఎక్కడలేని విధంగా ఐదు లక్షల ప్రమాద బీమా, లైఫ్‌ టాక్స్‌ రద్దు లాంటి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఆటో ట్రాన్స్పోర్ట్‌ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు లైసెన్స్‌ లేని వారికి లైసెన్స్‌ లు ఇప్పించాలన్నారు ఆటో డ్రైవర్లకు కాకి డ్రస్‌ ఇప్పించాలని తెలిపారు. ఎంఎల్‌సి యాదవ్‌ రెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల కుటుంబాలు ఆధారపడ్డ ఆటో రంగాన్ని రక్షించడానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు నర్సంపల్లి అర్జున్‌ గౌడ్‌ , అంజన్‌ గౌడ్‌ , మహేశ్‌ యాదవ్‌ , నర్సింహా రెడ్డి ,ఐలయ్య , బిఆర్‌టియూ ప్రధాన కార్యదర్శి బాలరాజ్‌ యాదవ్‌, ఎస్‌కే ఫరీద్‌, అంతని ఆసా, ఆర్‌ దయాకర్‌, ఎండి కరీం, ఎండి సూరజ్‌, రాజుచారి, నిలకంఠం శ్రీకాంత్‌,పాతూర్‌ మహంకాళి, ఆర్‌%డ%ఆర్‌ కాలనీ ఉపాధ్యక్షులు పెంట మీది కనకయ్య , జెనెరల్‌ సెక్రెటరీ మన్నే లక్ష్మి నారాయణ , సెక్రెటరీ దయ్యపు రమేష్‌ ,క్యాషియర్‌ మాల్కంటి మధు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పంజాల వెంకటేష్‌ ఆటో యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love