హామీలు నెరవేర్చడం లేదని సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ- నవీపేట్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండల బిజెపి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సరిన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత ఎరువులు, దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బందు, బీసీ బందు, డబుల్ బెడ్ రూమ్ లు మరియు పంట నష్టపరిహారం హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదని వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, రామకృష్ణ, ఎంపీటీసీ మైసరాద, సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, బాలగంగాధర్ రెడ్డి, రాజేందర్ గౌడ్, రాజశేఖర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love