లుక్‌ఔట్‌ నోటీసు రద్దు చేయండి : మార్గదర్శి శైలజ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అమరావతి పీఎస్‌లో నమోదైన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోరాదన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏపీ సీఐడీ లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసిందని మార్గదర్శి ఎండీ శైలజ చెరుకూరి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ శరత్‌ విచారించారు. ఏపీ సీఐడీ ఇమిగ్రేషన్‌ అధికారులకు ఇచ్చిన లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ను రద్దు చేయాలనీ, అమెరికాలో ఉన్న శైలజ జూన్‌ 3న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని ఆమె లాయర్‌ వాదించారు. సీఐడీ విచారణకు శైలజ సహకరిస్తున్నప్పటికీ లుక్‌ఔట్‌ నోటీసు ఇవ్వడం అన్యాయమన్నారు. ఏప్రిల్‌ 23న సీఐడీ విచారణకు హాజరయ్యారనీ, తర్వాత విచారణ మే 13కి వాయిదా పడిందని, అయితే శైలజ ఏప్రిల్‌27 నుంచి మే 22 వరకు అందుబాటులో ఉండరని తెలిపారని వివరించారు. జూ న్‌ 6న ఉదయం పది గంటలకు ఇంటి వద్ద విచారణ చేస్తామని సీఐడీ నోటీ సు ఇవ్వగా అందుకు సమ్మతిని తెలియజేశారనీ, ఈ పరిస్థితుల్లో సీఐడీ అధికా రులు లుక్‌ఔట్‌ చర్యలకు ఉపక్రమించారని తప్పుపట్టారు. లుక్‌ఔట్‌ నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

Spread the love