– గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి
– ఆమనగల్, కడ్తాల్ మండల వ్యవసాయ అధికారులు అరుణ కుమారి, శ్రీలత
– ఆయా మండలాల్లో కొనసాగుతున్న రైతు అవగాహనా సదస్సులు
– నకలీ విత్తనాలు, ఎరువుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన
నవతెలంగాణ-ఆమనగల్
విత్తనాల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని, గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని ఆమనగల్, కడ్తాల్ మండలాల వ్యవసాయ అధికారులు అరుణ కుమారి, శ్రీలత రైతులకు సూచించారు. ప్రస్తుతం ప్రారంభంకానున్న ఖరీఫ్ సీజన్ పంటల సాగును దృష్టిలో పెట్టుకుని వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు అవ గాహనా సదస్సులు ఈ నెల 27 నుంచి ఆయా మండలాల్లో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. గురువారం ఆమనగల్ మండలంలోని సంకటోని పల్లి, ఆమనగల్, ఆకుతోటపల్లి, సింగంపల్లి గ్రామా లలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సుల్లో మండల వ్యవసాయ అధికారి అరుణ కుమారి రైతులకు ఆయా పంటల సాగుకు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పిం చారు. ముఖ్యం గా విత్తన ఎంపిక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవి దుక్కుల ప్రాముఖ్యత, పచ్చిరొట్ట ఎరువు, సేంద్రియ వ్యవసాయం తదితర అంశాలపై రైతులకు ఆమె అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తీర్ణ అధి కారులు రాణి, మీనాక్షి, సాయిరామ్, శివతేజ, కౌన్సి లర్ కమటం రాధమ్మ వెంకటయ్య, రైతులు దావ ధనుంజయ, శ్రీపాల్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. అదేవిధంగా కడ్తాల్ మండలంలోని రావి చేడ్, అన్మాస్‌పల్లి, సాలార్‌పూర్, ముద్విన్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు అవగాహనా సదస్సుల్లో మండల వ్యవసాయ అధికారి శ్రీలత అనేక అంశాలపై అవగాహన కల్పించారు. నిర్ణీత సైజులో కంపెనీకి సంబంధించి ప్యాక్ చేయని విత్త నాలను కోనుగోలు చేయరాదని సూచించారు. అదే విధంగా కొనుగోలు చేసిన విత్తనాలు ఎరువులకు సంబంధించిన రసీదులు తప్పనిసరిగా తీసు కోవాలని, విత్తన ఖాలీ ప్యాకెట్‌తో పాటు రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకో వాలన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు,ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. ప్రతీ విత్తన ప్యాకెట్‌పై తయారైన తేదీ, కాలం ముగిసిన తేదీలను తప్పక గమనించాలని వారు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీల సంఘం కార్యదర్శి, రావిచేడ్ ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్, ఏఈఓలు వందన, అభినవ్, కేదార్ సింగ్, రమణ, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.