నవతెలంగాణ- హైదరాబాద్: అసోంలోని గువహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు పోలీసుల అనుమతించనప్పటికీ బారికేడ్లు తొలగించుకుని నగరం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. తాజాగా అసోం పోలీసులు ఈ కేసు సీఐడీకి బదిలీ చేశారు. దర్యాప్తు కోసం సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.