Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతి

పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతి

- Advertisement -

10 సంవత్సరాల నుండి అందిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు
1964 69వ హెచ్ ఎస్ సి బ్యాచ్
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండల కేంద్రంలోని గౌట్ హై స్కూల్ మరియు జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తున్నట్లు 1964 69వ హెచ్ ఎస్ సి బ్యాచ్ రిటైర్డ్ ఉద్యోగులు సోమయ్య సదానంద చారి ఆంజనేయులు శేష అవతారం ఉప్పలయ్య అప్పన్న వీరారెడ్డి సహకారంతో అందిస్తున్న మని తెలిపారు. శనివారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గత సంవత్సరం చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మెరిట్ మార్కులు సాధించిన గౌట్ హైస్కూల్ మరియు జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు పాస్టర్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు పారితోషికంగా ఒకరికి 4000 మరో నలుగురికి రెండు వేల రూపాయలను అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి సంవత్సరం అందించినట్లే ఈ సంవత్సరం కూడా అందించామని చెప్పారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నంత స్థాయికి ఎదగాలని కోరారు. విద్యార్థులు గురువులు పాఠాలు బోధించే సమయంలో ఏకాగ్రతతో విని ఇంటికెళ్ల ప్రత్యేక సమయం కేటాయించి ఆడాలను తిరిగి చదవాలని అన్నారు కష్టపడి చదివి ఉన్నంత స్థాయికి ఎదిగిన పడ కన్న తల్లిదండ్రులకు పాఠాలు బోధించిన గురువులకు పుట్టిన ఊరికి పేరు ప్రఖ్యాతలు సంపాదించి గౌరవంగా సమాజ సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -