నవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముధోల్ ల్లోని తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారి లక్ష్మన్, మండల విద్యా వనరుల కార్యాలయంలో విద్యాధికారి రమణ రెడ్డి, పొలీస్ స్టేషన్ లో సీఐ రవీందర్ నాయక్, ఏరువాక వ్యవసాయ పరిశోధన స్థానంలోశాస్త్రవేత్త దినేష్, ఎడిఏ కార్యాలయంలో ఎడిఎ శ్రీనివాస్ రాజు, ఐకెపి కార్యాలయంలో ఏపీవో గురుచరన్ ముధోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శబనా బేగం, ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ రాజేశ్వరి, ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సూర్యదాస్, పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ సాయికుమార్, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ లక్ష్మయ్య గౌడ్ జెండాను ఎగరవేశారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గ్రామపంచాయతీలలో సర్పంచ్ లు త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని రభింద్రా, అక్షర, శ్రీవిద్యా, శిశు మందీర్, ఫ్యూచర్, భాష్యం, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముధోల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -



