నగదు రహిత వైద్యానికి మంత్రితో చర్చించాలి..

Cashless medicine should be discussed with the minister.– ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిధిలో వెల్నెస్ సెంటర్ను పటిష్ట పరచాలి 
– బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి విన్నవించిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులలో అనుమతించే విధంగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రితో చర్చించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పరిధిలోని వెల్నెస్ సెంటర్ను పటిష్ట పరచాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కి శనివారం సుభాష్ నగర్ లో గల ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు వారు అభినందించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ఎమ్మెల్యే ని శాలువతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఎమ్మెల్యేలు కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు, జిల్లా నాయకులు శిర్ప హనుమాన్లు, ఇ.వీ.ఎల్. నారాయణ, హమీద్ ఉద్దీన్, లక్ష్మీనారాయణ, లింగయ్య, శ్రీనివాస్ రావు, రైసుద్దీన్, జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love